టీమిండియా చరిత్ర సృష్టించి సంవత్సరకాలం

భారత క్రికెట్‌లో జూన్ 29, 2024కి ప్రత్యేకత ఉంది. టీమ్ ఇండియా రెండో టీ20 ప్రపంచ కప్ సాధించి సరిగ్గా నేటికి ఏడాది. రోహిత్ శర్మ ని భారత జట్టు బార్బడో వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లో 7 పరుగుల తేడాతో గెలిచి విశ్వవిజేతగా నిలిచాడు. 17 ఏళ్ల నిరీక్షణ తర్వాత భారత్ పొట్టి కప్పును సాధించడం విశేషం. ఈ మ్యాచ్ ముగిసిన అనంతరం రోహిత్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి (విరాట్ కోహ్లీ) అంతర్జాతీయ టీ20 కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. 2024 టీ20 వరల్డ్ కప్ సాధించి రాహుల్ ద్రవిడ్ కూడా సగర్వంగా కోచ్ బాధ్యతల నుంచి రిలీవ్ అయ్యాడు. వరల్డ్ కప్ గెలిచిన తర్వాత అతనిని ఎత్తుకొని సంబరాలు చేసుకుని గొప్పగా వీడ్కోలు పలికారు

హార్దిక్ భావోద్వేగం..

2024 ప్రపంచ కప్ ముందు వరకు ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ విషయంలో రోహిత్, హార్దిక్ మధ్య విభేదాలు వచ్చాయి. అయితే, ఫైనల్ తర్వాత వాటన్నింటికి చెక్ పడింది. హార్దిక్ కన్నీళ్లు పెట్టుకుని భావోద్వేగానికి పాల్పడ్డాడు.  అప్పుడు రోహిత్ (రోహిత్ శర్మ) అతడిని హత్తుకుని ఓదార్చాడు. తాజాగా రెండో టీ20 ప్రపంచ కప్ అందించిన బార్బడోస్ మైదానం పిచ్ జీవితాంతం గుర్తుంచుకునేలా.. రోహిత్ పిచ్ పై ఉన్న మట్టిని నోట్లో వేసుకున్నాడు. అప్పట్లో ఈ వీడియో వైరల్ గా మారింది.

చరిత్రలో నిలిచిపోయే సూర్య క్యాచ్

చివరి ఓవర్లో మొదటి బంతికి డేవిడ్ మిల్లర్ ఇచ్చిన క్యాచ్ బౌండరీ లైన్ వద్ద తన శరీర బరువును నియంత్రించుకుంటూ సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగా అందుకున్నాడు. అప్పటికి సఫారీల చేతిలో ఉన్న మ్యాచ్ ఈ క్యాచ్ తో మ్యాచ్ భారత్ వైపు మళ్లింది. ఈ క్యాచ్ సూర్య కెరీర్‌లోనే కాకుండా భారత క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది.