పంత్‌ పై ఫైర్ అయిన అశ్విన్

పంత్‌ పై ఫైర్ అయిన అశ్విన్

చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ అయినా పంత్ పై విమర్శలు గుప్పించాడు. దానికి అసలు కారణం ఏంటంటే ..

ఆర్సీబీ- లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్‌లో ఆర్సీబీ బ్యాటర్ జితేశ్ శర్మను ఔట్ చేసేందుకు దిగ్వేశ్ రాథీ మన్కడింగ్ చేశాడు. కానీ తర్వాత ఇది నిబంధనలకు విరుద్దంగా ఉందని , అప్పటికే దిగ్వేశ్ బౌలింగ్ యాక్షన్ పూర్తయిందని థర్డ్ అంపైర్ నాటౌట్ ప్రకటించాడు. అయితే అంతకంటే ముందే లక్నో కెప్టెన్ రిషభ్ పంత్.. అప్పీల్‌ను ఉపసంహరించుకున్నాడు. దీనిపై రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు. పంత్ నిర్ణయాన్ని ఖండించాడు.

అసలేం జరిగిందంటే..

ఆర్సీబీ.. 17వ ఓవర్‌లో బ్యాటింగ్ చేస్తుండగా.. దిగ్వేశ్ రాథీ మన్కడింగ్ చేశాడు. స్ట్రైకింగ్ ఎండ్‌లో మయాంక్ అగర్వాల్ ఉండగా.. నాన్‌ స్ట్రైకింగ్ ఎండ్‌లో జితేశ్ శర్మ ఉన్నాడు. అయితే జితేశ్‌ను దిగ్వేష్‌ మన్కడింగ్‌ చేయడానికి ప్రయత్నించాడు. బంతిని వేసే క్రమంలో ఆగిపోయి, బెయిల్స్‌ను లేపేశాడు. అప్పటికి జితేశ్‌ క్రీజుకు దూరంగా ఉన్నాడు. దిగ్వేష్ అప్పీల్ చేయగా.. దీంతో జితేశ్ ఔట్ అని అనుకున్నారు.

కానీ రాథీ యాక్షన్‌ పూర్తి కావడంతో నిబంధనల ప్రకారం జితేశ్‌ను థర్డ్‌ అంపైర్‌ నాటౌట్‌గా ప్రకటించాడు. అయితే థర్డ్ అంపైర్ నిర్ణయం వెలువడకంటే ముందే లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషభ్ పంత్.. అప్పీల్‌ను వెనక్కితీసుకున్నాడు.

అయితే పంత్ పై తొలిసారి మన్కడింగ్‌ను అమలు చేసిన రవిచంద్రన్ అశ్విన్ విమర్శలు గుప్పించాడు. ఇది బౌలర్‌ పరువు తీయడమే అని వ్యాఖ్యానించాడు. రిషభ్‌ పంత్ అద్భుతమైన క్రికెటర్. ఈ మ్యాచ్‌లో అతడు 118 రన్స్ చేశాడు. కానీ దిగ్వేష్ రాథీ గురించి మీరు ఒకసారి ఆలోచించండి. అతడు చేసిన పనిని కోట్లాది మంది ప్రజల ముందు కెప్టెన్ తప్పుబట్టాడు. ఇది కరెక్టు కాదు.

ఎందుకంటే ఏ కెప్టెన్ అయినా ఆటగాడికి మద్దతు ఇవ్వాలి. ఇది బౌలర్‌కు ఘోరమైన అవమానం. మరోసారి అతడు మన్కడింగ్ చేయడు. దిగ్వేష్ నా చుట్టం కాదు.. నా ఫ్రెండ్ కూడా కాదు. కానీ నేను చెప్పేది ఒక్కటే. ఇలాంటి చర్యలతో బౌలర్‌ను హర్ట్ చేశారు అని తన యూట్యూబ్ ఛానెల్‌లో అన్నాడు.

అసలు మన్కడింగ్ అనే పేరు ఎలా వచ్చిందంటే..

1947-48లో భారతదేశం ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా జరిగిన ఒక సంఘటన కారణంగా “మన్కడింగ్” అనే పదానికి వినూ మన్కడ్ పేరు పెట్టారు. సిరీస్‌లోని రెండవ టెస్ట్ మ్యాచ్‌లో, ఇండియన్ బౌలర్ మన్కడ్ బంతిని వేయడానికి వచ్చినప్పుడు నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న ఆస్ట్రేలియా ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ బిల్ బ్రౌన్‌ను ముందుకు రావడంతో మన్కడింగ్ అతనిని రనౌట్ చేశాడు.  వినూ మన్కడ్ మొదటిసారి విధంగా అవుట్ చేయడం తో అతని పేరు మీదగా దీనికి మన్కడింగ్ అనే పేరు వచ్చింది.


		

Leave a Comment