విజువల్ వండర్ గా తేజ సజ్జా ‘మిరాయ్’

విజువల్ వండర్ గా తేజ సజ్జా ‘మిరాయ్’

హనుమాన్ తో సూపర్ డూపర్ హిట్ కొట్టి పాన్ ఇండియాలో స్థాయిలో గుర్తింపు అందుకున్న తేజ సజ్జా నటిస్తున్న తదుపరి ఫాంటసీ సూపర్ హీరో సినిమా ‘మిరాయ్’ . పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టి.జి. విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ మూవీ టీజర్ తాజాగా విడుదలై మంచి టాక్ తో సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతుంది.

‘ఈగల్’ ఫేమ్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ లో మంచు మనోజ్ ది బ్లాక్ స్వోర్డ్ పాత్రలో ప్రతి నాయకుడిగా కనిపించనున్నారు. రితిక నాయక్ హీరోయిన్ గా , శ్రియ శరణ్, జయరాం, జగపతిబాబు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సెప్టెంబర్ 5న పలు భాషల్లో సినిమా విడుదల కానుంది.

ఇటీవలే విడుదలైన టీజర్‌కి ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన వచ్చింది. ‘‘జరగబోయేది మారణహోమం.. శిథిలం కాబోతుంది అశోకుడి ఆశయం..’’ అంటూ జయరాం వాయిస్ ఓవర్ తో ప్రారంభమైన టీజర్‌లో హాలీవుడ్ స్థాయి విజువల్స్ తో ఆకట్టుకుంది . ‘హనుమాన్’తో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందిన తేజా మరో హిట్ తన ఖాతాలో వేసుకునేలా టీజర్‌ ఉంది.

Leave a Comment