BCCI కి కుక్క వల్ల రెండు కోట్ల నష్టం..?
బీసీసీఐకి ఇప్పుడు ఒక పేరు తలనొప్పిగా మారింది. ఆ పేరు వల్ల న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటుంది. రోబో కారణంగా చిక్కుల్లో పడింది . దీని వల్ల బోర్డు ఖజానాకు కోట్లలో నష్టం వాటిల్లే ప్రమాదం ఏర్పడింది. అసలు ఏంటా రోబో.. దాని విషయంలో బీసీసీఐ చేసిన తప్పేంటి.. కోర్టు కేసుల వరకు ఎందుకు దారితీసింది.. అనేది ఇప్పుడు చూద్దాం.
చంపక్ తోనే ఇబ్బందులు..
ప్రతి ఐపీఎల్ సీజన్‌లో ఏదో ఒక కొత్త టెక్నాలజీని బీసీసీఐ పరిచయం చేస్తుంది. ఈ సీజన్‌లో చంపక్ అనే రోబోటిక్ డాగ్‌ను తీసుకొచ్చారు. ఈ రోబో గ్రౌండ్‌లోని చాలా విషయాలను కెమెరా కవర్ చేస్తూ అందర్నీ ఆనంద పరుస్తుంది . ప్లేయర్ల ఆటతీరును దగ్గర నుంచి మానిటర్ చేస్తోంది. ఆన్లైన్లో పాపులర్ అయిన ఈ రోబోకు చంపక్ అనే పేరు పెట్టింది బీసీసీఐ. ఇదే ఇప్పుడు బోర్డును చిక్కుల్లో పడేసింది. ఈ పేరు వల్ల సమస్యలను ఎదుర్కొంటోంది. పరువునష్టం కింద రూ.2 కోట్లను చెల్లించాలంటూ బోర్డుపై ఓ ప్రసిద్ధ పిల్లల పత్రిక కేసు వేసింది.
ముంబై ఢిల్లీ మ్యాచ్ సందర్భంగా..
ఏప్రిల్ 13న ఢిల్లీ – ముంబై ఇండియన్స్ మ్యాచ్ సందర్భంగా ఈ రోబోటిక్ కుక్కను పరిచయం చేశారు. అలాగే హైదరాబాద్ సన్రైజర్స్, ముంబై ఇండియన్స్ 33 మ్యాచ్ సందర్భంగా ఆన్లైన్ పోల్ నిర్వహించి ఈ రోబోటిక్ కుక్కకి పేరును ఎంచుకోవాలని కోరింది. ఈ సందర్భంగా చంపక్ అనే పేరును 76 శాతం మంది ఎంపిక చేశారు. ఆ రకంగా చంపక్ అనే పేరును బీసీసీఐ ఈ డాగ్ కు పెట్టింది. ఇదే ఇప్పుడు బీసీసీఐకి తలనొప్పిగా మారింది.