HIT3: బాక్స్ ఆఫీస్ దగ్గర వీకెండ్ లో సూపర్ సాలిడ్ కలెక్షన్స్ తో ఎక్స్ లెంట్ ట్రెండ్ ను చూపించి ఓవరాల్ గా 93% రికవరీని సొంతం చేసుకుని చరిత్ర సృష్టించింది.
నాచురల్ స్టార్ నాని లేటెస్ట్ మూవీ హిట్3 (హిట్ 3) సినిమా, ఓవరాల్ గా ఎక్స్ లెంట్ రికవరీని సొంతం చేసుకున్న తర్వాత ఇప్పుడు వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అయి మండే టెస్ట్ పాస్ అయ్యిందో లేదో చూద్దాం.
అన్ని సినిమాల మాదిరిగానే హిట్ 3 సినిమాకి కూడా వర్కింగ్ డే ఇంపాక్ట్ వల్ల డ్రాప్స్ అయితే సొంతం చేసుకుందని చెప్పాలి.
మొత్తంగా సండే తో పోల్చితే మండే రోజున ఓవరాల్ గా సినిమా 50-60% రేంజ్ లో ఆన్‌లైన్ టికెట్ సేల్స్ డ్రాప్స్ అయినట్లు సూచిస్తున్నాయి.
ఆఫ్ లైన్ లో కూడా ఈ విధంగా ఉండే అవకాశం ఉన్న నేపధ్యంలో ఓవరాల్ గా ఉన్న ట్రెండ్ ను బట్టి చూస్తే సినిమా తెలుగు రాష్ట్రాల్లో 5వ రోజున 1.8-2 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ని అందుకు అవకాశం ఉందని చెప్పాలి.
ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే షేర్ కొంచం పెరిగే అవకాశం ఉంది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లో కూడా డ్రాప్స్ ఉండగా ఓవరాల్ గా 5వ రోజున వరల్డ్ వైడ్ గా 2.6-3 కోట్ల రేంజ్ లో షేర్ వచ్చే అవకాశం అని చెప్పాలి.
ఫైనల్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 3 కోట్ల పైన షేర్ వచ్చే అవకాశం ఉంది. ఇక ఐదు రోజుల అఫీషియల్ కలెక్షన్స్ ఏ విధంగా ఉంటాయో చూడాలి.