Bad News for NTR:ఎన్టీఆర్ అభిమానులకు నిరాశ

NTR:ఎన్టీఆర్ అభిమానులకు నిరాశ

NTR: యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ బాలీవుడ్ లో నటిస్తున్న డైరెక్ట్ మూవీ వార్ 2. ఈ మూవీలో ఎన్టీఆర్ హృతిక్ రోషన్ తో స్క్రీన్ షేరింగ్ చేసుకుంటున్నాడు.ఈ చిత్రానికి బ్ర‌హ్మాస్త్ర ఫేం అయాన్ ముఖ‌ర్జీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. య‌ష్‌రాజ్ ఫిలింస్ అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మిస్తోంది. అయితే ఈ క్రేజీ మూవీ తెలుగు హక్కుల కోసం భారీగానే పోటీ ఉంది. ఈ మూవీ హక్కుల కోసం జూనియర్ ఎన్టీఆర్ కి సన్నిహితుడైన సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ మరియు ఆసియన్ సంస్థలు పోటీపడుతున్నాయని తెలిసింది.

కానీ ఇప్ప‌టి వ‌ర‌కూ వార్ 2 తెలుగు రైట్స్ డీల్ ఇంకా పూర్తవలేదని తెలిసింది.  ఇదే ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానులకు నిరాశ కలిగించే విషయం. నాగ వంశి అంటే ఎన్టీఆర్ అభిమానుల్లో ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంది. ఆయన ఏ మూవీ తీసిన ఆ మూవీని బాగా ప్రోమోట్  చేస్తారనే పేరుంది. అలాగే ఎన్టీఆర్ న‌టించిన ‘దేవ‌ర‌’ను నాగ‌వంశీ స్వ‌యంగా పంపిణీ చేయ‌డ‌మే గాక, ఆ సినిమా ప్ర‌మోష‌న్స్ కోసం ఎంతో హార్డ్ వ‌ర్క్ చేసాడు. అత‌డి డెడికేష‌న్ న‌చ్చిన తార‌క్ ఇప్పుడు య‌ష్ రాజ్ ఫిలింస్ కి నాగ‌వంశీని ప‌రిచ‌యం చేసాడ‌ని క‌థ‌నాలొస్తున్నాయి. ‘వార్ 2’ రైట్స్ ని సితార అధినేత ద‌క్కించుకునేందుకు వంద‌శాతం ఛాన్సుంది. కానీ ఇంకా డీల్ పూర్తి కాలేదు.

దీనిపై నాగ వంశీ స్పందిస్తూ ఒక నోట్ ని ఇన్ స్టాలో రిలీజ్ చేసాడు. వార్ 2 తెలుగు రిలీజ్ హ‌క్కుల‌కు సంబంధించిన డీల్ ఇంకా ముగియ‌లేద‌ని నాగ‌వంశీ వెల్ల‌డించారు. ఒక‌వేళ హ‌క్కులు ద‌క్కించుకుంటే, సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ అధికారికంగా ప్ర‌క‌టిస్తుంద‌ని తెలిపారు. ఆగ‌స్ట్ 14న వార్ 2 విడుద‌ల కానుంది.

 

 

Leave a Comment