SRH Vs DC: ఐపీఎల్ 18లో భాగంగా హైదరాబాద్ వేదికగా ఎస్ఆర్ హెచ్ – ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ ఇచ్చారు. దీంతో హైదరాబాద్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి వైదొలిగింది.తొలుత టాస్ ఓడి బౌలింగ్ కి దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది.
అశుతోష్ శర్మ (41), స్టబ్స్ (41) రాణించారు. ఇన్నింగ్స్ ముగిసిన అనంతరం వర్షం ప్రారంభం కావడంతో హైదరాబాద్ జట్టు బ్యాటింగ్ కు దిగలేదు. వర్షం ఎక్కువగా కురవడంతో గ్రౌండ్ లో భారీగా వర్షపు నీరు నిలిచింది. తర్వాత వర్షం తగ్గినప్పటికీ గ్రౌండ్ మొత్తం తడిగా ఉండడంతో మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. దీంతో హైదరాబాద్ కు ఉన్న ఒక్క అవకాశాన్ని కోల్పోయింది.