Murali Nayak: ఆర్మీలో చేరేందుకు మురళి నాయక్ ఎంత కష్టపడ్డాడో చూశారా

Murali Nayak: ఆర్మీలో చేరేందుకు మురళి నాయక్ ఎంత కష్టపడ్డాడో చూశారా

Murali nayak: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్ ఇండియా ఆపరేషన్ సిందూర్ లో భాగంగా అగ్ని వీర్ మురళి నాయక్  దేశం కోసం ప్రాణాలు త్యాగం చేశాడు.

23 సంవత్సరాలు వయసులోనే దేశ రక్షణలో ప్రాణాలు కోల్పోయిన మురళి నాయక్  (Murali nayak) తను ఆర్మీలో చేరేందుకు చాలా కష్టపడ్డాడు. అతను ఏ విధంగా ఆర్మీలో చేరడానికి కష్టపడ్డాడో తెలిపే వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అయింది.

మురళి నాయక్ ది ఆంధ్రప్రదేశ్ లోని  శ్రీ సత్యసాయి జిల్లా, గోరంట్ల మండలానికి చెందిన కల్లి తండా గ్రామం. దేశ సేవ చేయాలనే ధ్యేయంతో 2022 డిసెంబరు 29న అగ్నివీరగా భారత సైన్యంలో చేరారు. నాసిక్‌లో శిక్షణ పూర్తి అయిన తరువాత మొదట అస్సాంలో విధులు నిర్వహించాడు.

అనంతరం జమ్మూకాశ్మీర్‌కు బదిలీ అయ్యి అక్కడ 851 లైట్ రెజిమెంట్‌లో ఉత్తర కమాండ్‌లో విధులు నిర్వహించారు. కానీ దురదృష్టవశాత్తు, మే 8న రాత్రి జరిగిన శత్రు కాల్పుల్లో గాయపడి మరుసటి రోజు ఉదయం ప్రాణాలు కోల్పోయారు.

మురళి మృతదేహాన్ని సైనిక వాహనంలో బెంగళూరు విమానాశ్రయం నుంచి ఆయన గ్రామానికి రోడ్డు మార్గం ద్వారా తీసుకొచ్చారు. మధ్యలో వేలాది మంది ప్రజలు ఆయనకు రోడ్లపై నిలబడి నివాళులర్పించారు.

ఆదివారం మురళినాయక్ స్వగ్రామం లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సైనిక లాంచనాలతో  అంత్యక్రియలు జరిగాయి. అంత్యక్రియలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ మద్దతు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మురళి నాయక్ కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా, 5 ఎకరాల వ్యవసాయ భూమి, 300 గజాల నివాస భూమి, ఒక కుటుంబ సభ్యుడికి ఉద్యోగం వచ్చింది. అలాగే సీఎం పవన్ కల్యాణ్ వ్యక్తిగతంగా రూ.25 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించారు.

మురళి నాయక్ సైన్యంలో చేరడానికి ఏ విధంగా కష్టపడ్డాడో ఆ వీడియోను మీరు ఒకసారి చూడండి.

 

Leave a Comment