Panjab- Mumbai: ముంబై తో మ్యాచ్ కి ముందు పంజాబ్ కి భారీ షాక్

ముంబై తో మ్యాచ్ కి ముందు పంజాబ్ కి భారీ షాక్

ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ కి ముంది పంజాబ్ కి భారీ షాక్ తగిలింది. పంజాబ్ ఆటగాడు, మిస్టరీ బౌలర్ యుజ్వేంద్ర చాహల్ (Yuzvendra Chahal) గాయం తో ఈ మ్యాచ్ కి దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

చాహల్ ఈ మ్యాచ్ ఆడకపోవడానికి కారణం తన మణికట్టు గాయం అని తెలుస్తోంది. ఈ కారణంగా ఈ మ్యాచ్‌లో చాహల్ ఆడటం లేదు. ప్లే ఆఫ్స్ కి చేరాలంటే కచ్చితంగా గెలవాల్చిన ఈ మ్యాచ్ల్లో చాహల్ దూరం కావడం పంజాబ్ కి పెద్ద దెబ్బె.

చాహల్ (Yuzvendra Chahal) ఐపీఎల్‌లో అద్భుతమైన ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. ఈ సీజన్‌లో చాహల్ 11 మ్యాచ్‌లలో 14 వికెట్లు తీసాడు , చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్‌లో ఒక ఓవర్‌లో నాలుగు వికెట్లు తీసి ఈ సీజన్ లో హ్యాట్రిక్ సాధించిన మొదటి బౌలర్ గా నిలిచాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 111 పరుగుల అత్యల్ప స్కోరును కాపాడుకున్నారంటే దానికి కారణం చాహల్ .

ఈ మ్యాచ్ లో 4 వికెట్లు తీసి పంజాబ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు . ముంబై ఇండియన్స్ లాంటి బలమైన బ్యాటింగ్ లైనప్‌ను నియింత్రించాలంటే చాహల్ లాంటి సీనియర్ ఆటగాడు అవసరం. ఈ సమయంలో చాహల్ గాయం సమస్య గా మారింది . ఆటను లేకపోతే పంజాబ్ జట్టు బౌలింగ్ బాధ్యతలను హర్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్లను వంటి స్పిన్నర్లు జట్టు లోకి తీసుకోవాల్సి ఉంటుంది.

చాహల్ అనుభవం, వికెట్ తీసే సామర్థ్యం ఈ స్పిన్నర్లలో కనిపించకపోవచ్చు. ఫాస్ట్ బౌలర్లలో కగిసో రబాడ, అర్ష్‌దీప్ సింగ్, హర్షల్ పటేల్ ఉన్నప్పటికీ, మధ్య ఓవర్లలో చాహల్ లాంటి స్పిన్నర్ లేకపోవడం జట్టుకు భారీ నష్టమని చెప్పవచ్చు. చాహల్ మణికట్టు గాయం కారణంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ఆడలేదు. అయితే, ప్లే ఆఫ్ మ్యాచ్‌లకు అతను అందుబాటులో ఉంటాడని జట్టు యాజమాన్యం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

ఈ గాయం తీవ్రత గురించి ఖచ్చితమైన సమాచారం ఇంకా వెల్లడి కాలేదు. కానీ వైద్య బృందం అతని రికవరీ కోసం తీవ్రంగా పనిచేస్తోంది. చాహల్ లేని లోటును భర్తీ చేయడానికి జట్టు యాజమాన్యం రిజర్వ్ ఆటగాళ్లను సిద్ధం చేస్తోంది. అయితే అతని స్థానంలో సమానమైన ప్రభావం చూపగల ఆటగాడిని తీసుకోవడం చాలా సవాలని చెప్పుకోవచ్చు.

రెండు జట్లకు ఈ మ్యాచ్ ఎంతో కీలకం

పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగే ఈ మ్యాచ్ ప్లే ఆఫ్ రేసులో ఉన్న రెండు జట్లకు ‘చావో రేవో’ స్థాయిలో ఉంది. ఐపీఎల్ చరిత్రలో ఈ రెండు జట్లు 31 సార్లు తలపడగా, ముంబై 16 సార్లు, పంజాబ్ 15 సార్లు విజయం సాధించాయి. ఈ సీజన్‌లో రెండు జట్లు ఆరు మ్యాచ్‌లు ఆడి, నాలుగు ఓటములతో నాలుగు పాయింట్లు మాత్రమే కలిగి ఉన్నాయి. రన్ రేట్ పరంగా పంజాబ్ కొంచెం మెరుగ్గా ఉన్నప్పటికీ, ఈ మ్యాచ్ ఫలితం రెండు జట్ల ప్లే ఆఫ్ అవకాశాలను నిర్ణయిస్తుంది. ఈ సమయంలో చాహల్ లేకపోవడం పంజాబ్ జట్టు బౌలింగ్ వ్యూహంపై తీవ్ర ప్రభావం చూపనుంది.