Biggboss Show: బిగ్ బాస్ షో నిర్వాహకులకు హైకోర్టు నోటీసులు

ఇన్నేళ్లకు నా పోరాటానికి ఫలితం 

Biggboss: బిగ్‌బాస్ షో నిర్వాహకులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో నోటీసులు పంపారు. 
ఈ విషయమై తిరుపతిలోని సీపీఐ కార్యాలయంలో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ
గత కొన్నేళ్లుగా నేను చేస్తున్న పోరాటం ఫలించిందని, హైకోర్టు నోటీసులు పంపడం శుభపరిణామమన్నారు. 
బిగ్‌బాస్‌ షో నిర్వహించడం ముమ్మాటికీ అసాంఘిక చర్యగా అభివర్ణించారు. బిగ్‌బాస్ షో సమాజానికి హానికరం అన్నారు.
ఈ షోలకు ప్రజలు ఆకర్షితులై  దేశ సంస్కృతిని చిన్నచూపు చూసే అవకాశం ఉంది. బిగ్‌బాస్ షోలో జరుగుతున్న అసాంఘిక కార్యక్రమాలను ఆపాలని పోలీస్ స్టేషన్లను, కోర్టులను ఆశ్రయించానని చెప్పారు. మూడేళ్లుగా ఈ పోరాటం చేస్తూ హైకోర్టును ఆశ్రయించాం. 
బిగ్‌బాస్ నిర్వాహకులకు నోటీసులు పంపడం ఆనందంగా ఉందన్నారు. బిగ్‌బాస్‌ షోల ద్వారా నిర్వాహకులు సమాజానికి ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారో చెప్పాలన్నారు. స్త్రీలను గౌరవిస్తున్న మన దేశ సంస్కృతిలో ఇలాంటి షోలు అవసరమా అని ఆయన ప్రశ్నించారు.
అందాల పోటీలు నిర్వహించడం మంచిది కాదు..
తెలంగాణాలో అందాల పోటీలు నిర్వహించడం మంచి పద్ధతి కాదన్నారు. ప్రపంచ దేశాలు మన సంస్కృతి వైపు చూస్తుంటే కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం స్త్రీలను పాశ్చాత్య సంస్కృతి వైపు మళ్లించే ప్రయత్నాలు చేయడం అన్యాయమన్నారు.

Leave a Comment