దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత ఇటీవల నం.1 ర్యాంక్ (ICC Rankings)ను కింగ్ కోహ్లీ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే అయితే ఆ ఆనందం కొన్ని రోజుల్లోనే ఆవిరైది. ఐసీసీ (ICC) తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్ లో న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్ కోహ్లీని వెనక్కి నెట్టి నం.1 స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. అతడు 845 పాయింట్ల తో మొదటి స్థానాన్ని చేజిక్కించుకున్నాడు. ఇంతకు ముందు మొదటి స్థానంలో ఉన్న విరాట్ కోహ్లి (Virat Kohli) 795 పాయింట్లతో రెండో స్థానానికి పడిపోయాడు. ఇక న్యూజిలాండ్ సిరీస్లో విఫలమైన రోహిత్ శర్మ (Rohit Sharma) మూడో స్థానం నుంచి నాలుగో స్థానానికి (ICC Rankings) పడిపోయాడు.
ప్రస్తుతం అతడి ఖాతాలో 757 పాయింట్లున్నాయి. మూడో స్థానంలో 764 పాయింట్లతో అఫ్గానిస్థాన్ బ్యాటర్ ఇబ్రహీం జద్రాన్ నిలిచాడు. శుభ్మన్ గిల్ 723 పాయింట్లో అయిదో స్థానంలో ఉన్నాడు. కేఎల్ రాహుల్ (670 పాయింట్లు) పదో, శ్రేయ అయ్యర్ (650) 11వ స్థానాల్లో కొనసాగుతున్నారు.
176 యావరేజ్ తో 352 పరుగులతో మిచెల్ భీభత్సం
ఇటీవల భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన మూడు వన్డేల సిరీస్లో కివీస్ బ్యాటర్ డారిల్ మిచెల్ 176.00 యావరేజ్లో 352 పరుగులు చేసిన విషయం తెలిసిందే. ఇందులో రెండు భారీ సెంచరీలు (137, 131), ఒక హాఫ్ సెంచరీ (84) ఉన్నాయి. విరాట్ కోహ్లి 80.00 యావరేజ్ తో 240 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ (124), ఒక హాఫ్ సెంచరీ (93) ఉన్నాయి. రాజ్కోట్ వేదికగా జరిగిన రెండో మ్యాచ్లో కోహ్లి (24) బ్యాటింగ్లో విఫలమయ్యాడు.
టీ20 లో మొదటి స్థాన్నాన్ని నిలబెట్టుకున్న అభిషేక్ శర్మ
ఇక టీ20 ర్యాంకింగ్స్ విషయానికి వస్తే అభిషేక్ శర్మ 908 పాయింట్లతో మొదటి స్థానం లో కొనసాగుతున్నాడు. తెలుగువాడైన తిలక్ వర్మ (805 పాయింట్లు) మూడో స్థానంలో ఉన్నారు. టెస్ట్ ర్యాంకింగ్స్లో 880 పాయింట్లతో ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్ తొలి, యశస్వి జైస్వాల్ (750 పాయింట్లు) ఎనిమిదో, శుభ్మన్ గిల్ (730 పాయింట్లు) పదో స్థానంలో ఉన్నారు.
బౌలింగ్ విషయానికి వస్తే టెస్ట్ ర్యాంకింగ్స్ లో బుమ్రా (879 పాయింట్లు), టీ20ల్లో వరుణ్ చక్రవర్తి (804), వన్డేల్లో రషీద్ ఖాన్ (710 పాయింట్లు) తొలిస్థానాల్లో నిలిచారు.