వార్ 2 ట్రైలర్ వచ్చేది అప్పుడేనా ?
War2 Trailer : పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులు ఎంతో ఆతృతగా పాన్ ఇండియా మూవీ వార్ 2. (War 2) హృతిక్ రోషన్ మరియు జూనియర్ ఎన్టీఆర్ (NTR) నటించిన ఈ సినిమా పై ప్రేక్షకులు ఎంతగానో ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు . ఎట్టకేలకు ఈ సినిమా ట్రైలర్ ను ఇపుడు రిలీజ్ చేస్తున్నారో తెలిసింది .
ఈ ట్రైలర్‌ను (War2 Trailer) జూన్ 6 న అక్షయ్ కుమార్ నటించిన హౌస్‌ఫుల్ 5 ( Housefull 5) ప్రదర్శిస్తున్న థియేటర్లో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు .
ఎన్టీఆర్ కి పెద్దగా మార్కెట్ ఉన్న సౌత్ ఇండియా లో ఈ మూవీ ట్రైలర్ ను కమల్ హాసన్ నటించిన థగ్ లైఫ్ చిత్రంతో పాటు ట్రైలర్ ప్రసారం అయ్యేలా మేకర్స్ చూస్తున్నారు . ఆ విధంగా ట్రైలర్ రిలీజ్ చేయడం కోసం ఎగ్జిబిటర్లు మరియు మల్టీప్లెక్స్ ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తుంది . హౌస్‌ఫుల్ 5 మరియు థగ్ లైఫ్‌తో ప్రదర్శితమయ్యే థియేటర్లలో ట్రైలర్ (War2 Trailer) ప్రదర్శించబడుతుంది .
వార్ 2 (War2 Trailer) మూవీ ఆగష్టు 14 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది . జూన్ నుండి ఆగస్టు వరకు రిలీజ్ కి 40 రోజుల టైం ఉంటుంది . ఈ టైం మూవీ ప్రమోషన్స్ కి ఈ ట్రైలర్ ఉపయోగ పడుతుంది అని మేకర్స్ భావిస్తున్నారు.
టీజర్ కి సూపర్ రెస్పాన్స్
రీసెంట్ గా మే 20 ఎన్టీఆర్ బర్త్ డే సందర్బంగా రిలీజ్ అయినా వార్ 2 టీజర్ ప్రేక్షకుల నుంచి మంచి పాజిటివ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది . వార్ 2 మూవీ పై తెలుగులో కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
దేవర తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా కావడం , వార్ మూవీ కి సీక్వెల్ అవడం తో తెలుగు రైట్స్ 110 కోట్లకు అమ్ముడైన ట్లు వార్తలు వచ్చాయి . ఇప్పటి వరకు డబ్బింగ్ సినిమాలకు తెలుగు లో కెజిఫ్ 2 హక్కులు 80 కోట్లకు అమ్ముడయ్యింది . ఇప్పుడు వార్ 2 ఆ రికార్డ్స్ ని బద్దలు కొట్టింది .