HHVM: ఎట్టకేలకు హరిహర వీరమల్లు షూటింగ్ పూర్తి
HHVM: పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీర మల్లు చిత్రం ఎట్టకేలకు షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా నిర్మాత ఏ.ఎం.రత్నం తెలియజేస్తూ ఆనందం వ్యక్తం చేశారు.
పవన్ కల్యాణ్ హీరోగా జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘హరిహర వీరమల్లు’ పార్ట్ 1 షూటింగ్ మంగళవారంతో పూర్తయింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ నిర్మాత ఏ.ఎం.రత్నం ఆనందం వ్యక్తం చేశారు. ‘షూటింగ్ పూర్తయింది. ఇక థియేటర్లలో విడుదల కావడమే తరువాయి. సాంగ్స్, అదిరిపోయే ట్రైలర్ త్వరలో విడుదలవుతాయి’ అని ఏ.ఎం.రత్నం తెలిపారు.
ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ చారిత్రక యోధుడిగా నటిస్తున్నారు. నిధి అగర్వాల్ కథానాయిక. బాబీ డియోల్, అనుపమఖేర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని మే 9న విడుదల చేయనున్నట్లు గతంలో మేకర్స్ ప్రకటించారు. అయితే కొంత షూటింగ్ మిగిలి ఉండడంతో వాయిదా పడింది. ఇప్పుడు మొత్తం చిత్రీకరణ పూర్తయినందున విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నట్లు చిత్రబృందం పేర్కొంది.
ఈ చిత్రానికి కొంత భాగం డైరెక్టర్ క్రిష్ దర్శకత్వం వహించాడు. తర్వాత షూటింగ్ లేట్ అవుతుండటం , వేరే ప్రాజెక్ట్స్ ఉండటంతో ఈ ప్రాజెక్ట్ నుండి బయటకు వచ్చిన విషయం తెలిసిందే.