High court: అలాగైతే ఎస్సీ హోదా కోల్పోతారు

హైకోర్టు: అలాగైతే ఎస్సీ హోదా కోల్పోతారు

క్రైస్తవంలోకి మారిన రోజే షెడ్యూల్ కులాల వ్యక్తులు ఎస్సీ హోదా కోల్పోయిన ఎస్సీ ఎస్టీ చట్టంతో రక్షణ పొందలేరని ఒక పాస్టర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా హైకోర్టు తేల్చి చెప్పింది.

ఉమ్మడి గుంటూరు జిల్లా పిట్టలవానిపాలెం మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన పాస్టర్ చింతాడ 2021లో తనను కులం పేరుతో దూషించి దాడి చేసి గాయపరిచారని చందోలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామానికి చెందిన రామిరెడ్డి మరో ఐదుగురిపై ఎస్సీ ఎస్టీ చట్టంతో ఐపీసీ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి నిందితులు కేసు కొట్టు వేయాలని 2022లో హైకోర్టులో పిటిషన్ వేశారు.

పిటిషనర్లు తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ పదేళ్లుగా ఫిర్యాదుదారు పాస్టర్గా పనిచేస్తున్నారు.  దీని ప్రకారం రాజ్యాంగం ఆర్డర్ 1950 ప్రకారం హిందూ మతాన్ని కాకుండా ఇతర మతాలను స్వీకరించిన వారు ఎస్సి హోదా కోల్పోతారు. ఆ మతాన్ని స్వీకరించిన వారికి ఎస్సీ ఎస్టీ చట్టం కింద రక్షణ ఉండదని సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చిందన్నారు.  ఈ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి ఫిర్యాదుదారుడికి ఎస్సీ ఎస్టీ చట్టం వర్తించదని తీర్పులో పేర్కొన్నారు

Leave a Comment