IAF Air Exercise : ఎయిర్ ఫోర్స్ భారీ ఎక్సర్‌సైజ్

సరిహద్దు వెంబడి భారీ వైమానిక ఎక్సర్‌సైజ్

IAF Air Exercise:  పహల్గాం ఘటన తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తితలు పెరిగాయి. దీంతో బోర్డర్లో యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సరిహద్దు వెంబడి దక్షిణ సెక్టర్‌ గగనతలంలో ఎయిర్ ఎక్సర్‌సైజు నిర్వహించనుంది. ఈ మేరకు నోటామ్ జారీ చేసింది.

మే 7, 8 తారీఖుల్లో సరిహద్దు వెంబడి దక్షిణ సెక్టర్‌లో భారీ వైమానిక ఎక్సర్‌సైజు నిర్వహించేందుకు కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు నోటామ్ (NOTAM) జారీ చేసింది. యుద్ధ సన్నద్ధతలో భాగంగా ఈ ఎయిర్ ఎక్సర్‌‌సైజుకు కేంద్రం సిద్ధమైంది. ఇందులో భాగంగా రాజస్థాన్‌లో సరిహద్దు వెంబడి పలు వైమానిక విన్యాసాలు కూడా నిర్వహించనున్నారు. మే 7న మధ్యాహ్నం 3.30 గంటలకు ఎక్సర్‌సైజు ప్రారంభమవుతుందని, మరుసటి రోజు రాత్రి 9.30 వరకూ కొనసాగుతోందని కేంద్రం తన నోటీసుల్లో పేర్కొంది. ఈ సమయంలో ప్రభావిత ప్రాంతాల గగతలంలో పలు ఆంక్షలు అమల్లో ఉంటాయని కూడా ప్రభుత్వం పేర్కొంది.

ఇందులో భాగంగా ఫైటర్ జెట్స్‌తో పాటు నిఘా విమానాలు పలు విన్యాసాలు నిర్వహిస్తాయి. ఎయిర్ ఫోర్స్ సన్నద్ధను పరీక్షించేందుకు పలు ఆపరేషన్లో పాల్గొంటాయి. ఈ ప్రాంతంలో సరిహద్దు వెంబడి పలు ఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలో ఎయిర్ ఎక్సర్‌సైజు నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

పహల్గాం ఘటన విషయంలో అంతర్జాతీయ సమాజం జోక్యం కోసం ప్రయత్నిస్తున్న పాక్‌కు అడుగడుగునా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఐక్యరాజ్య సమితి తాజాగా భద్రతా మండలి సమావేశాల్లో కొన్ని దేశాలు ఉగ్రవాదుల మూలాలపై పాక్‌ను నిలదీయడంతో దయాది దేశానికి నోటమాట రాలేదని తెలిసింది.

Leave a Comment