పాకిస్థాన్ సంచలన ప్రకటన
Ind- Pak War: సరిహద్దుల్లో ఇండియా పాకిస్థాన్ ల మధ్య పరస్పర దాడులు కొనసాగుతున్న వేళా పాకిస్థాన్ ఉప ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల్లో శాంతిని నెలకొల్పటానికి ముందుగా భారతదేశం దాడులు ఆపేస్తే, తాము కూడా దాడులను ఆపుతామని ఆయన ప్రకటించారు.
ఇండియా పాకిస్థాన్ ( india pak war) దేశాల మధ్య దాడులు క్రమేపి పెరుగుతున్నాయి. ఇలాగే కొనసాగితే మరికొన్ని రోజుల్లో అది యుద్ధంగ మారే ప్రమాదం ఉంది. ఇప్పటికి సరిహద్దు ప్రాంతాల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో యుద్ధ వాతావరణం పెరుగుతోంది. ఈ సయమంలో పాకిస్తాన్ ఉప ప్రధానమంత్రి ఇషాక్ దార్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోతో మాట్లాడుతూ, ఇండియా దాడులను ఆపితే, పాకిస్తాన్ కూడా అదే చేస్తుందన్నారు. ఇప్పుడు ఈ విషయం పరిస్ధితిని మరింత ఉద్రిక్తంగా మారకుండా ఉండేందుకు సంకేతాన్ని ఇస్తుందని చెప్పవచ్చు.
అయితే ఈ ప్రకటనపై భారత్ ఎలా స్పందిస్తుందో , ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే చూడాలి.
పలు ప్రదేశాలపై పాకిస్థాన్ దాడి
భారత్ తాజాగా షోర్కోట్‌లోని రఫికి ఎయిర్‌బేస్, చక్వాల్‌లోని మురిద్ ఎయిర్‌బేస్, రావల్పిండిలోని చక్లాలా కాంట్‌పై దాడులు చేసిందని పాకిస్థాన్ సైన్యం ఈ రోజు ఉదయం ప్రకటించింది. దీనికి బదులు వారు భారతదేశంలోని 10 ప్రదేశాలపై దాడి చేసినట్లు పేర్కొన్నారు. ఇందులో పంజాబ్‌లోని బ్రహ్మోస్ క్షిపణి స్టోరేజ్, ఉరి సరఫరా డిపో, రాజస్థాన్‌లోని సూరత్‌గఢ్ ఎయిర్‌ఫీల్డ్, ఆదంపూర్‌లోని S-400 వ్యవస్థ, డెహ్రాంగ్యారి, పఠాన్‌కోట్ ఎయిర్‌ఫీల్డ్ వంటి ప్రాంతాల్లో ఉన్నాయని చెబుతోంది.
ఇండియా ఉగ్రవాద శిబిరాలపై దాడి చేస్తే పాకిస్థాన్ మాత్రం ఇండియా లోని పౌరులను టార్గెట్ చేసి మిసైల్స్ ను ప్రయోగిస్తోంది. ఆ దాడులను ఇండియన్ ఆర్మీ సమర్ధవంతంగా ఎదుర్కొంటుంది.