మే 13 నుంచి టోర్నీ ప్రారంభమయ్యే అవకాశం
IPL- 2025: భారత్, పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరగడంతో బీసీసీఐ (BCCI) ఐపీఎల్ లో మిగిలిన మ్యాచ్‌లను ప్రారంభించి పూర్తి చేసే పనుల్లో ఉంది. త్వరలో కొత్త షెడ్యూల్‌ను రూపొందించి ఐపీఎల్ (ipl-2025) ను తిరిగి ప్రారంభించే ఆలోచనలో ఉన్నామని ఫ్రాంచైజీలకు మార్గదర్శకాలు జారీ చేసింది.
-
పంజాబ్ కింగ్స్ మినహా అన్ని జట్లకు మే 13లోగా ఆటగాళ్లు తమ హోం గ్రౌండ్లలో అందుబాటులో ఉండేలా చూడాలని సూచించింది.
-
ఐపీఎల్ షెడ్యూల్‌ను తిరిగి రూపొందించే పనిలో బీసీసీఐ ఉంది. ఫ్రాంచైజీలకు మౌఖికంగా ఈ విషయాన్ని తెలియజేసినట్టు సమాచారం.
-
విదేశీ ఆటగాళ్ల ప్రయాణ వివరాలు తెలియజేయాలని ఫ్రాంచైజీలను బీసీసీఐ కోరింది. దీంతో ఫ్రాంఛైజీలు తమ విదేశీ ప్లేయర్లను వెనక్కి రప్పించడానికి ఏర్పాట్లు చేస్తున్నాయి.
-
మే 13 నాటికి ఆటగాళ్లు అందుబాటులోకి వస్తే, మే 25లోపే టోర్నమెంట్ ముగించాలనే లక్ష్యంతో, మిగిలిన 12 మ్యాచ్‌లను రోజుకు రెండు మ్యాచ్ ల చొప్పున నిర్వహించేందుకు చూస్తున్నట్లు తెలుస్తుంది.
-
పంజాబ్ కింగ్స్‌కు తటస్థ వేదిక ఇవ్వనున్నట్లు తెలుస్తున్నా, ఇంకా ఆ వేదిక ఖరారవ్వలేదు.
ఈ పరిణామాలు ఐపీఎల్ అభిమానులకు ఆనందం కలిగిస్తోంది.