రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఎందుకంటే ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక సార్లు 500 ప్లస్ సీజన్ రన్ చేసిన బ్యాటర్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు.
ఈ సీజన్లో ఇప్పటి వరకు విరాట్ కోహ్లీ 505 రన్స్ చేసి టాప్ స్కోరర్ గా నిలిచి ఆరెంజ్ క్యాప్‌ను తిరిగి కైవసం చేసుకున్నాడు.
డేవిడ్ వార్నర్ రికార్డ్ బద్దలు..
ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక సార్లు 500 ప్లస్ సీజన్లలో బ్యాటర్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు. ఈ సీజన్లో ఇప్పటి వరకు విరాట్ కోహ్లీ 505 రన్స్ చేశాడు.
ఐపీఎల్లో కోహ్లీ 500 ప్లస్ రన్స్ చేయడం ఇది 8వ సారి. ఈ అతను డేవిడ్ వార్నర్ రికార్డ్‌ను అధిగమించాడు. వార్నర్ 7 సార్లు 500 ప్లస్ రన్స్ చేశాడు.
300 సిక్సులు మైలురాయిని దాటి..
ఐపీఎల్లో 300 సిక్స్‌ల మైలురాయి అందుకున్న కోహ్లీ.. ఒకే జట్టు ఈ ఘనత సాధించిన ఏకైక ఆటగాడిగా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.
ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఈ ఫీట్ సాధించాడు.
సీఎస్కే బౌలర్ ఖలీల్ అహ్మద్ వేసిన మూడో ఓవర్లో చివరి రెండు బంతులను కోహ్లీ భారీ సిక్సర్లుగా మలిచి ఈ ఫీట్ సాధించాడు.
ఈ జాబితాలో విరాట్ కోహ్లీ 301* సిక్స్‌లతో టాప్‌లో కొనసాగుతోంది. కోహ్లీ తర్వాత క్రిస్ గేల్ బెంగళూరు తరపున 263 సిక్స్‌లు కొట్టగా..
ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మ 262, కీరన్ పోలార్డ్ 258 సిక్స్‌లు బాదారు.
సీఎస్కే కంపెనీ ధోనీ 257 సిక్స్‌లు కొట్టాడు. ఐపీఎల్లో గత 18 సీజన్లుగా విరాట్ కోహ్లీ ఆర్సీబీకే ఆడుతున్న విషయం తెలిసిందే.
ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ(33 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో 62)హాఫ్ సెంచరీ నమోదు చేసి పలు రికార్డులను సాధించాడు.