IPL-2025: ఐపీఎల్ (IPL)లో పంజాబ్ కింగ్స్ (Punjab Kings) ఏడో విజయం సాధించింది. ఆదివారం జరిగిన మ్యాచ్లో లక్నోపై ఆ జట్టు 37 పరుగుల తేడాతో గెలుపొందింది.
టాస్ గెలిచిన లక్నో పంజాబ్ కు బ్యాటింగ్ అప్పగించింది. ఓపెనర్ ప్రభ సిమ్రన్ సింగ్ (91; 48 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్స్ లు) విరుచుకు పడడంతో పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 236 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన లక్నో 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 199 పరుగులకు పరిమితం అయింది.
ఆయుష్ బదోనీ (74; 40 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్ లు), అబ్దుల్ సమద్ (45. 24 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్ లు) పోరాడినా రన్ రేట్ పెరిగిపోవడంతో ఫలితం లేకుండా పోయింది.
పేలవంగా ప్రారంభించి…
237 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన పంజాబ్ కు ప్రారంభంలోనే మిచెల్ మార్ష్ అర్షదీప్ బౌలింగ్ లో డకౌట్ అయ్యాడు. తర్వాత బ్యాటింగ్ వచ్చిన మార్ క్రమ్ (13), నికోలస్ పూరన్ (6), రిషబ్ పంత్ (18), డేవిడ్ మిల్లర్ (11) పరుగులు చేశారు.
అర్షదీప్ సింగ్ (3/16) ఆరంభంలో వరుసగా మూడు వికెట్లు పడగొట్టి లక్నోకు షాక్ ఇచ్చాడు. ఒమర్జాయ్ 2, చాహల్, యాన్సెన్ ఒక్కో వికెట్ తీశారు. ఈ విజయంతో పంజాబ్ ప్లే ఆప్స్ కు మరింత చేరువైంది. ఆ జట్టు ఇప్పటివరకు 11 మ్యాచ్లో 7 విజయాలు సాధించింది. ఒక మ్యాచ్ వర్షం వల్ల రద్దు అయింది. ప్రస్తుతం పంజాబ్ ఖాతాలో 15 పాయింట్లు ఉన్నాయి. లక్నోకు 11 మ్యాచ్ ల్లో ఇది ఆరో ఓటమి.
తొలుత ప్రభ సిమ్రన్ సింగ్ తో పాటు మిగతా బ్యాటర్లు చెలరేగడంతో పంజాబ్ భారీ స్కోరు చేసింది. శ్రేయస్ అయ్యర్ (45; 25 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్ లు), జోష్ ఇంగ్లిస్ (30; 14 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్స్ లు), శశాంక్ సింగ్ (33*; 15 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్), స్టాయినిస్ (15; 5 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్), నేహల్ వధేరా (16*; 9 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడటంతో పంజాబ్ 236 పరుగుల భారీ స్కోర్ సాధించింది.