NTR vs Ameerkhan: ఎన్టీఆర్ నటించ బోయే ప్రాజెక్టుతో ఆమీర్ ఖాన్ కూడా పోటీలోకి రానున్నాడా అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు . అసలు విషయం ఏంటో ఇప్పుడు చూద్దాం.
సినీ పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే (Dada Saheb Palke) జీవిత కథ తో ఎస్ ఎస్ రాజమౌళి సమర్పణలో ఎన్టీఆర్ (NTR) హీరోగా ‘మేడ్ ఇన్ ఇండియా’ సినిమా తెరకెక్కిస్తున్నట్లు టాక్ వినిపిస్తున్న సమయంలో, ఇప్పుడు ఆమిర్ ఖాన్ (Ameerkhan) కూడా అదే బయోపిక్ లో నటించనున్నట్లు బాలీవుడ్ వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పుడు ఇదే ఇండస్ట్రీ వర్గాల్లో చర్చినీయాంచగా మారింది.
ఇలా ఒకే కథతో టాలీవుడ్, బాలీవుడ్ లో రెండు సినిమాలు రూపొందనున్నాయనే వార్తలు ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
భారతీయ సినీ పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే జీవితం ఆధారంగా ‘మేడ్ ఇన్ ఇండియా’ (Made in India) అనే మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దర్శక ధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి సమర్పణలో రెండేళ్ల క్రితమే ఈ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసారు.
ఏడాది కాలంగా ఈ స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తున్నారు. కథ ఓ కొలిక్కి రావడంతో ఇటీవలే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు నేరేషన్ ఇచ్చినట్లు రెండు రోజులుగా వార్తలు వినిపించాయి. అయితే ఇంతలోనే ఆమీర్ ఖాన్ దాదా సాహెబ్ ఫాల్కే బయోపిక్ లో నటించనున్నట్లు టాక్ బయటకు వచ్చింది.
బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్, డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణీ (Rajkumar Hirani) కాంబినేషన్ లో ఫాల్కే బయోపిక్ రూపొందుతున్నట్టుగా బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. భారతదేశ స్వతంత్ర పోరాట నేపథ్యంలో, ఇండియన్ సినిమాకి పునాది వేసిన వ్యక్తి యొక్క అసాధారణ ప్రయాణాన్ని ఈ చిత్రంలో చూపించబోతున్నారని బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరుణ్ ఆదర్శ్ ఎక్స్ లో పోస్ట్ పెట్టాడు.
గత నాలుగేళ్లుగా ఈ స్క్రిప్ట్‌కి సంబంధించిన పనులు జరుగుతున్నాయని, ‘సితారే జమీన్ పర్’ రిలీజైన వెంటనే దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ కోసం ఆమిర్ సిద్ధం కానున్నారని, 2025 అక్టోబరులోనే షూటింగ్ స్టార్ట్ అవుతుందని పేర్కొన్నారు.
దాదాసాహెబ్ ఫాల్కేగా జూ.ఎన్టీఆర్ నటిస్తున్నారని వార్తలు వచ్చిన మరుసటి రోజే, ఫాల్కే జీవిత కథతో ఆమీర్ ఖాన్ సినిమా చేయనున్నారని వార్తలు వచ్చాయి. ఒకేసారి ‘ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా’ జీవిత కథతో రెండు చిత్రాలను తెరకెక్కించనున్నారని న్యూస్ రావడం.. అది కూడా టాలీవుడ్, బాలీవుడ్ కు చెందిన సినీ ప్రముఖులు ఈ ప్రాజెక్ట్స్ లో భాగం అవుతుండటం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఫాల్కేగా ఎన్టీఆర్, ఆమీర్ ఖాన్ లలో ఎవరు సెట్ అవుతారనే చర్చ కూడా మొదలైంది.
రాజమౌళి, ఆమీర్ ఖాన్ మధ్య అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా..
నిజానికి స్క్రిప్ట్స్ విషయంలో రాజమౌళి, ఆమీర్ ఖాన్ ల మధ్య క్లాష్ ఏర్పడటం ఇదేమీ మొదటిసారి కాదు. మహాభారతం తన డ్రీం ప్రాజెక్ట్ అని రాజమౌళి( Rajamouli) ప్రకటించగానే.. భారతం మీద సినిమా తీయాలని ఎన్నో ఏళ్ల నుంచి అనుకుంటున్నానని అమీర్ తెలిపారు. భారీ స్థాయిలో కొన్ని పార్ట్స్ గా ఈ చిత్రం రూపొందుతుందని ఇటీవలే ప్రకటించారు.
అందులో తాను కృషుడి పాత్ర పోషించే అవకాశం ఉందని హింట్ ఇచ్చారు. రీసెంట్ గా ఆమీర్ ఇంట్లో అల్లు అర్జున్ కనిపించడంతో, అర్జునుడి పాత్రలో బన్నీ నటిస్తారనే ప్రచారం ఊపందుకుంది. ఇప్పుడు రాజమౌళి నిర్మాణంలో ఎన్టీఆర్ హీరోగా దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ తెరకెక్కనుందని అనుకుంటున్న టైంలో, అదే కథతో ఆమీర్ ఖాన్ సినిమా చేస్తారని అంటున్నారు.
ఇలా రాజమౌళి, ఆమీర్ ఖాన్ లు ‘మహా భారతం’, దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ విషయాల్లో ఇద్దరి మధ్య క్లాష్ ఏర్పడుతుంది . ఈ రెండు ప్రాజెక్ట్స్ లో రాజమౌళి తో పోలిస్తే ఆమీర్ సినిమాలే ముందుగా ఆడియన్స్ ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఒక్కో చిత్రానికి ఏళ్ల తరబడి సమయం తీసుకునే జక్కన్న.. ఇప్పుడప్పుడే భారతాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్లే ఛాన్స్ లేదు. ఆమీర్ అనుకుంటే ముందుగానే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కవచ్చు.
ఇక ‘మేడ్ ఇన్ ఇండియా’ మూవీకి రాజమౌళి ప్రజెంటర్ మాత్రమే. నితిన్ కక్కర్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాని వరుణ్ గుప్తా, ఎస్.ఎస్.కార్తికేయ నిర్మించనున్నారు. ఎన్టీఆర్ ఎప్పుడు డేట్స్ ఇస్తే అప్పుడు ఈ సినిమా ప్రారంభమవుతుంది.
ఇలా ఒకే బయో గ్రఫీ విషయంలో ఇద్దరు స్టార్ హీరో లు , స్టార్ డైరెక్టర్ల మధ్య పోటీ ఏర్పడనుంది. చూద్దాం ఈ బయో గ్రఫీ లో ఎవరు నటిస్తారో, ఎవరు ముందుగా ప్రేక్షకుల ముందుకి తీసుకువస్తారో వేచి చూడాలి.
#BreakingNews… AAMIR KHAN – RAJKUMAR HIRANI REUNITE FOR BIOPIC ON DADASAHEB PHALKE… #AamirKhan and director #RajkumarHirani are joining forces once again, this time for a biopic on #DadasahebPhalke, the father of #Indian cinema.
Set against the backdrop of #India‘s… pic.twitter.com/RzSATeOCYo
— taran adarsh (@taran_adarsh) May 15, 2025