PAK-IND: పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఎక్కడ?
IND – PAK: పహల్గాం ఉగ్రదాడి పై ప్రతీకారంగా ఇండియా ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్థాన్ లోని ఉగ్ర స్థావరాలపై దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో ఇరు దేశాల మధ్య యుద్ద వాతావరణం.
ఈ సమయంలో పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ సయ్యద్ అసిమ్ మునీర్ అహ్మద్ షా కనిపించడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి.
పహల్గాం ఉగ్రదాడికి ముందు హిందువులు, ముస్లింలు వేరంటూ రెచ్చగొట్టే వాక్యాలు చేశాడు. ఆ వ్యాఖ్యలు చేసిన కొన్ని రోజులకి పహల్గం దాడి జరిగింది.
ఆ దాడి జరిగిన తర్వాత ఆయన ఎవరికీ కనిపించకుండా పోయారు. కనీసం మీడియా సమావేశాల్లోనూ పాల్గొనలేదు. భారత్ దాడి చేసిన తర్వాత కూడా ఆయన ఎక్కడ కనిపించలేదు. .
మునీర్ ‘దేశం వదిలి పారిపోయారు’ అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. హ్యాస్‌ట్యాగ్‌లు, మీమ్‌లు వెల్లువెత్తాయి. పాక్ ఆర్మీ చీఫ్ కుటుంబంతో విడిచి పారిపోయారని రావల్పిండిలోని బంకర్‌లో దాక్కున్నారని లేదా అతనిపై విమర్శలు వచ్చాయి.
ఈ ప్రచారం ఊపందుకోవడంతో పాకిస్థాన్ ప్రధానమంత్రి కార్యాలయం నష్టనివారణ చర్యలు చేపట్టింది. ఏప్రిల్ 26న ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్‌తో కలిసి జనరల్ మునీర్ ఓ కార్యక్రమంలో పాల్గొన్నారంటూ ఫొటోను ఎక్స్‌లో పోస్ట్ చేసింది.
‘అబోటాబాద్‌లోని పీఎంఏ కాకుల్‌లో 151వ లాంగ్ కోర్సు గ్రాడ్యుయేటింగ్ అధికారులతో గ్రూప్ ఫొటోలో ప్రధాని షెహబాజ్ షరీఫ్, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ సయ్యద్ అసిమ్ మునీర్, పీఎంఏ కాకుల్ అధికారులు. ఏప్రిల్ 26, 2025’ అని ఫొటోకు శీర్షిక కూడా పెట్టింది.
అయితే ఆర్మీ చీఫ్ కనిపించడం లేదన్న వార్తలను కప్పిపుచ్చడానికే ఏఐతో ఇలా ఫోటో జనరేట్ చేసిందని ప్రచారం జరుగుతుంది.