POKలో అలర్ట్..?

POKలో అలర్ట్..?

POK:  ఆహార నిల్పలు పెంచుకోవాలని పిఓకే లోని స్థానికులకు అధికారులు సూచించారు.

పహాల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. పాకిస్తాన్ వివాదాన్ని పూర్తిగా రూపుమాపాలంటే పిఓకే ను స్వాధీనం చేసుకోవాలని అంతర్జాతీయ స్థాయిలో ఇండియాకు సూచనలు వినిపిస్తున్నాయి. ఇటీవల భారత సంతతి చెందిన బ్రిటిష్ ఎంపీ లార్డ్ మేఘనాథ్ మాట్లాడుతూ కాశ్మీర్ వివాదాన్ని రూపుమాపాలంటే పిఓకే ను స్వాధీనం చేసుకోవాలని సూచించారు. భారత్ పై దాడులకు పాకిస్తాన్ ఈ ప్రాంతాన్ని ఉగ్రవాదులకు అడ్డాగా వాడుకుంటుంది.

రెండు నెలలు సరిపడా ఆహారం నిల్వ చేసుకోండి

భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం వాతావరణం నెలకొన్న తరుణంలో స్థానికులంతా రెండు నెలలకు సరిపడా ఆహార నిల్వలు తమ వద్ద ఉంచుకోవాలని చేద్రి ఉల్ హక్ శుక్రవారం స్థానిక అసెంబ్లీలో వెల్లడించారు. అలాగే ఆహారం, మందులు, కనీస అవసరాల కోసం 100 కోట్లతో  ఎమర్జెన్సీ ఫండ్ ఏర్పాటు చేశామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.

Leave a Comment