Prabhas- Vanga Movie: ప్రభాస్ సినిమాలో ఎన్టీఆర్ హీరోయిన్

ప్రభాస్ సినిమాలో ఎన్టీఆర్ హీరోయిన్

Prabhas- Vanga Movie: ప్రస్తుతం టాలీవుడ్‌లో కన్నడ భామల హవా కొనసాగుతోంది. రష్మిక మందానా, శ్రద్ధా శ్రీనాథ్ తర్వాత ఇప్పుడు రుక్మిణి వసంత్ దూసుకుపోతోంది. ‘సప్త సాగరాలు దాటి’ చిత్రంతో ఆకట్టుకున్న రుక్మిణి, ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్  (DRAGON) సినిమాలో ఛాన్స్ కొట్టేసిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రభాస్ – సందీప్ వంగా కాంబోలో తెరకెక్కనున్న పాన్ ఇండియా సినిమా ‘స్పిరిట్’’లో హీరోయిన్ ఛాన్స్ కొట్టేసినట్లు వార్తలు వస్తున్నాయి. దీపికా పదుకొణె 40 కోట్ల రెమ్యునరేషన్ అడగడంతో ఆమె స్థానంలో రుక్మిణిని తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నారని సమాచారం.

ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో కన్నడ భామల హవా ఎక్కువైంది. గతంలో మలయాళ బ్యూటీలు హల్‌చల్ చేయగా ఇప్పుడు కన్నడ హీరోయిన్ల వెంట పడుతున్నారు మన తెలుగు దర్శక నిర్మాతలు. రష్మిక మందానా, ఆషికా రంగనాధ్, శ్రద్ధా శ్రీనాధ్, నభా నటేష్.. ఇలా చాలామంది కన్నడ హీరోయిన్లు టాలీవుడ్‌లో క్రేజ్ తెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం ఈ లిస్టులో రుక్మిణి చేరింది. ఎన్టీఆర్-నీల్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన ఈ బ్యూటీకి మరో అద్బుత ఆఫర్ తలుపు తట్టినట్లు వార్తలొస్తున్నాయి.

ప్రస్తుతం ‘ది రాజా సాబ్’, ‘ ఫౌజీ’ చిత్రాలతో బిజీగా ఉన్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ త్వరలోనే సందీప్ రెడ్డి వంగాతో ‘స్పిరిట్’ (SPIRIT)  యూనిట్‌లో జాయిన్ కానున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న సందీప్ వంగా .. నటీనటుల సెలక్షన్లో బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ సరసన నటించే హీరోయిన్ కోసం వెతుకుతున్నాడు. పాన్ ఇండియా చిత్రం కావడంతో  ఇందులో దీపికా పదుకొణేని తీసుకోవాలని అనుకున్నాడట సందీప్ వంగా. ‘కల్కి’ మూవీలో వీరిద్దరు కలిసి నటించడం, దీపికాకు నేషనల్ వైడ్ క్రేజ్ ఉండటంతో అమె అయితేనే బాగుంటుందని అనుకున్నాడట. అయితే  దీపిక ఏకంగా రూ.40 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందని, అందుకే ఆమెను ఈ ప్రాజెక్ట్ నుండి తప్పించారని తెలుస్తోంది. వారు రూ.20 కోట్లు ఇవ్వడానికి సిద్ధపడినా ఆమె ఒప్పుకోలేదట. దీంతో చిర్రెత్తుకొచ్చిన వంగా.. ఆమెని ప్రాజెక్టు నుంచి తప్పించినట్లు వార్తలొచ్చాయి.

Leave a Comment