రేడియేషన్ లీక్ అవుతుందంటూ వార్తలు
Ind-Pak war effect: పహల్గాం దాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ దెబ్బకు పాకిస్థాన్ కాలబేరానికి వచ్చిన విషయం తెలిసిందే..
భారత దాడిలో పాకిస్థాన్ ఘోరంగా దెబ్బ తిందా? అందుకే కాళ్ల బేరానికి వచ్చిందా? పాకిస్థాన్ అణు స్థావరాలపై భారత్ దాడి చేసిందా? అంటే అవుననే అంటున్నారు సోషల్ మీడియా జనాలు. పాకిస్థాన్ అణు స్థావరాల నుంచి రేడియేషన్ లీక్ అవుతోందని సోషల్ మీడియాలో గగ్గోలు పెడుతున్నారు.
భారత దాడిలో పాకిస్థాన్ ఘోరంగా దెబ్బ తిందా? అందుకే కాళ్ల బేరానికి వచ్చిందా? పాకిస్థాన్ అణు స్థావరాలపై భారత్ దాడి చేసిందా? అంటే అవుననే అంటున్నారు సోషల్ మీడియా జనాలు. పాకిస్థాన్ అణు స్థావరాల (పాకిస్థాన్ అణు కేంద్రం) నుంచి రేడియేషన్ లీక్ అవుతోందని సోషల్ మీడియా జనాలు తెగేసి చెబుతున్నారు. అందుకు తగిన ఆధారాలను కూడా చూపిస్తున్నారు.
పెహల్గామ్ దాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ (operation sindoor)ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్‌లోని ఉగ్రశిబిరాలపై దాడి చేసింది. ప్రతిగా పాకిస్తాన్ కూడా కాల్పులు ప్రారంభించడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి
భారత సైన్యం పాకిస్తాన్ సైనిక స్థావరాలపై దాడి చేసింది. ఈ దాడిలో పాకిస్థాన్ అణు కేంద్రమైన సర్గోదా తీవ్రంగా దెబ్బతిన్నట్టు వార్తలు వస్తున్నాయి. సర్గోదా ఎయిర్‌బేస్‌కు సమీపంలోని కిరాణ హిల్స్‌కు సమీపంలో పాకిస్తాన్ న్యూక్లియర్ సెంటర్ ఉంది. భారత్ తన క్షిపణులతో సర్గోదా, నూర్ఖాన్ ఎయిర్‌బేస్‌లపై దాడి చేసింది. దీంతో దెబ్బతిన్న రియాక్టర్ల నుంచి రేడియేషన్ లీక్ అవుతున్నట్టు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. స్థానికులు వాంతులు, తలనొప్పి, ఊపిరి ఆడక ఇబ్బంది పడుతూ హాస్పిటల్స్‌లో జాయిన్ అవుతున్నారని సమాచారం.