Virat Kohili: మరో రెండు రికార్డ్స్ కి చేరువలో కోహ్లీ

మరో రెండు రికార్డ్స్ కి చేరువలో కోహ్లీ

IPl- 2025: ఐపీల్ 2025 లో మంచి ఫామ్‌లో ఉన్న కోహ్లీ పరుగుల వరద పారిస్తున్నాడు. ఇప్పుడు కోహ్లీ (విరాట్ కోహ్లీ) రెండు రికార్డులకు చేరువలో ఉన్నాడు. ప్రస్తుతం ఈ సీజన్‌లోనే వాటిని సాధించేందుకు అవకాశం పుష్కలంగా ఉంది. ప్రస్తుత ఐపీఎల్ (IPL) సీజన్‌లో ఆర్సీకీ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) తరపున 12 ఇన్నింగ్స్‌ల్లో 54 రన్స్‌తో కోహ్లి అత్యధిక పరుగుల బ్యాట్‌సమెన్‌గా కొనసాగుతున్నాడు. అతను మరో 24 పరుగులు చేస్తే టీ20ల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున 9,000 పరుగులు చేసి బ్యాటర్ గా నిలిచాడు. ఐపీఎల్‌లో 256 ఇన్నింగ్స్ 8,552 పరుగులు చేసిన కోహ్లి, ఛాంపియన్ లీగ్ టీ 20లో 14 ఇన్నింగ్స్ 424 పరుగులు సాధించాడు. మొత్తంగా ఆర్సీబీ తరపున 270 ఇన్నింగ్స్‌ల్లో 8,976 పరుగులు చేశాడు. ఈ మైలురాయిని బుధవారం లక్ష నవూ సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు జరిగే మ్యాచ్‌లోనే సాధించే అవకాశం ఉంది.

ఈ సీజన్ లోనే డేవిడ్ వార్నర్ రికార్డు బద్దలు కొడతాడా ?

కోహ్లి మరో అర్ధశతకం చేస్తే ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక అర్ధశతకాలు బాదిన బ్యాటర్‌గా నిలిచే అవకాశం ఉంది. ప్రస్తుతం అతడు 62 అర్ధశతకాలతో డేవిడ్ వార్నర్ తో (డేవిడ్ వార్నర్) సమానంగా ఉన్నాడు. ఈ సీజన్‌లో కోహ్లీ ఇప్పటికే ఏడు హాఫ్ సెంచరీలు సాధించాడు. ఇంతకు ముందు 2016 సీజన్‌లో 11, 2023 సీజన్‌లో 8 అర్ధశతకాలు బాదాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో ప్రస్తుతం ఆర్సీబీ 17 పాయింట్లలో మూడో స్థానంలో కొనసాగుతోంది.

ఆస్ట్రేలియన్ పేసరైన జోష్ హేజిల్ వుడ్ (జోష్ హాజిల్‌వుడ్) తిరిగి జట్టులో చేరనున్నాడు. ప్లేఆఫ్స్ నేపథ్యంలో బెంగళూరుకు ఇది నిజంగా శుభవార్తే. . లఖనవూ సూపర్ జెయింట్స్ తో (లక్నో సూపే జెయింట్స్) జరగనున్న మ్యాచ్ లో మంచి రన్ రేట్ తో విజయం సాధిస్తే ఆర్సీబీ పాయింట్ల పట్టికలో పంజాబ్ కింగ్స్ (పంజాబ్ కింగ్స్) ను వెనక్కి నెట్టి మొదటిస్థానంలోకి దూసుకువెళ్లే అవకాశం ఉంది.

ఆర్సీబీ ఈసారైనా ఐపీఎల్ టైటిల్ గెలుస్తుందనే ఆశ లో ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు ఆర్సీబీ ఉన్న ఫామ్ చుస్తే కప్పు గెలిచేలా కనిపిస్తోంది. ఈసారైనా బెంగుళూరు మొదటి టైటిల్ గెలుస్తుందో లేదో చూడాలి.

Leave a Comment