Bhuvaneswar Kumar World Record: భువనేశ్వర్ కుమార్ ప్రపంచ రికార్డు.. పవర్‌ప్లేలో అరుదైన ఘనత

Bhuvaneswar Kumar World Record: టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్ అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అరుదైన రికార్డు సాధించాడు. నాలుగేళ్ల తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన భువీ చరిత్ర సృష్టించాడు. పవర్‌ప్లేలో అత్యధిక డాట్ బాల్స్ వేసిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు.

నాలుగేళ్ల విరామం తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లోకి టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్ తిరిగి పునరాగమనం చేశాడు. క్రైస్ట్‌చర్చ్ వేదికగా న్యూజిలాండ్, భారత్ మధ్య ఈ రోజు టీ20 సిరీస్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్ తో నాలుగేళ్ల విరామం తర్వాత టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్ తిరిగి అంతర్జాతీయ క్రికెట్‌లోకి పునరాగమనం చేశాడు. ఈ క్రమంలోనే భువీ ప్రపంచ రికార్డు సృష్టించాడు. పవర్‌ప్లేలో అత్యధిక డాట్‌ బాల్స్‌ వేసిన బౌలర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో న్యూజిలాండ్‌ మాజీ పేసర్‌ టిమ్‌ సౌథీ రికార్డును భువీ బ్రేక్ చేశాడు.

పవర్‌ప్లేలో భువీ రికార్డు

క్రైస్ట్‌చర్చ్‌ వేదికగా జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో భారత్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. దీంతో కివీస్ జట్టు బ్యాటింగ్‌కు దిగింది. తొలి ఓవర్‌ వేసిన భువనేశ్వర్‌ కేవలం నాలుగు పరుగులే ఇచ్చి మూడు డాట్‌ బాల్స్‌ వేశాడు. దీంతో పూర్తి సభ్య దేశాల బౌలర్లలో అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ల పవర్‌ప్లేలో అత్యధిక డాట్‌ బాల్స్‌ వేసిన బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు.

ఆకట్టుకోలేక పోయిన భువీ

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. భువనేశ్వర్ ఈ మ్యాచ్ లో ప్రభావం ఏమి చూపించలేక పోయాడు. 4 ఓవర్లు వేసిన భువీ 49 రన్స్ ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. న్యూజీలాండ్ 20 ఓవర్లలో 4 వికెట్స్ కోల్పోయి 225 రన్స్ చేసింది.

Leave a Comment