మళ్ళీ పెరిగిన బంగారం ధరలు
గత కొన్ని రోజులు గా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు ( Today Gold Rate) ఈ రోజు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు మాత్రం స్థిరంగానే కొనసాగుతోంది.
దేశీయ బులియన్ మార్కెట్లో పసిడి ప్రియులకు షాక్ తగిలింది. గత కొన్ని రోజులుగా హెచ్చుతగ్గులు నమోదవుతున్న బంగారం ధరలు ( Today Gold Rate) ఈరోజు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం బలహీనపడటం, డాలర్ ఇండెక్స్‌లో మార్పులు, పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడం వంటి అంశాలు దేశీయ ధరలపై ప్రభావం చూపాయి. మరోవైపు వెండి ధరల్లో మాత్రం స్థిరత్వం నమోదైంది.
రూ 1,43, 570 కు చేరిన బంగారం
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారంపై రూ.770 పెరిగి రూ.1,43,570గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర ( Today Gold Rate) కూడా స్వల్పంగా పెరిగింది. 10 గ్రాముల ధరపై రూ.700 పెరిగి రూ.1,31,600కు చేరుకుంది.
డాలర్ బలహీన పడటం తో ..
అమెరికా ద్రవ్యోల్భణం అంచనాలకంటే తక్కువుగా రావడం వాళ్ళ డాలర్ బలహీన పడటం బంగారం ( Today Gold News) పెరగడానికి ఒక కారణం గా చెప్పవచ్చు.
దీనితో పాటు అమెరికా, ఇరాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తితలు చెలరేగడం తో పెట్టుబడి దారులు సురక్షిత పెట్టుబడిగా బంగారం వైపు మళ్లించారు.